సెక్షన్ ఆఫీసర్ ఇంటిపై ఎసిబి దాడులు
హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణతో నీటిపారుదల శాఖ సెక్షన్ ఆఫీసర్ ఆంజనేయబాబు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఇక్రిశాట్ కాలనీలో రెండతస్తుల భవనం, హస్మత్‌పేటలో మరో భవనంతోపాటు హైదరాబాద్, రాజమండ్రి, రంగారెడ్డి, పశ్చిమగోదావరి జిల్లాలోని కొల్వపల్లిలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. అపేక బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయని, మొత్తం ఆస్తుల విలువ కోట్లలోనే ఉంటుందని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications