దేశ విలువలపై దాడి: రాష్ట్రపతి

దేశం బహుముఖ అంతర్గత భద్రత సమస్యను ఎదుర్కుంటోందని ఆమె అన్నారు. ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాదు, జైపూర్, బెంగుళూర్, అస్సాంల్లో ఉగ్రవాద సంఘటనలు జరిగాయని ఆమె అన్నారు. విచక్షణారహితమైన దాడుల నుంచి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం దేశ అంతర్గత భద్రతను పటిష్టం చేశామని ఆమె చెప్పారు. దేశంలోని పలు రాష్ట్రాల్లోని వామపక్ష తీవ్రవాదం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసు బలగాలను ఆధునీకరించడం ద్వారా, సామాజిక-ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా దాన్ని ఎదుర్కుంటున్నామని ఆమె చెప్పారు. యుపిఏ ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలను ప్రస్తావించిన ఆమె ఇవన్నీ పేదల సంక్షేమంకోసమేనని వివరించారు. ఆర్థిక మాంద్యాన్ని అధిగమిస్తామని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications