తెలంగాణపై వైయస్ పాత పాటే

తెలంగాణ సెంటిమెంటును కాంగ్రెసు పార్టీ గుర్తించిందని, ఈ అంశం భావోద్వేగమైందనే విషయాన్ని తాను, తమ కాంగ్రెసు పార్టీ అంగీకరిస్తున్నాయని ఆయన చెప్పారు. తెలంగాణపై ఏకాభిప్రాయం కుదరలేదని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలా, మూడు ముక్కలు చేయాలా అనేది తేలలేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమకు భద్రత ఉండదని ముస్లిం మైనారిటీలు అంటున్నారని, అదే సమయంలో రాయలసీమ, ఉత్తరాంధ్ర రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లు వస్తున్నాయని, వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఈ విషయాలను పరిశీలించడానికి ఒక కమిటీ వేస్తామని ఆయన చెప్పారు. శాసనసభ్యులు, ఎమ్మెల్సీలతో ఈ కమిటీ వేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications