న్యూయార్క్ వద్ద విమాన ప్రమాదం
న్యూయార్క్: న్యూయార్క్ రాష్ట్రంలో ఒక విమానం ఇంటిపై కూలిన సంఘటన తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది. కోల్‌గాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 50 సీట్ల కెపాసిటీ గల కాంటినెంటల్ ఎక్స్‌ప్రెస్ విమానం న్యూయార్క్‌నుంచి బుఫాలో వెళుతోంది. బుఫాలో విమానాశ్రయం ఇంకా 5 మైళ్ల దూరంలో ఉండగా దారిలో ఓ ఇంటిపై విమానం కూలిపోయింది. దీంతో ఇళ్లు ఇంటికి కూడా మంటలు అంటుకున్నాయి. ప్రమాదంలో ఎంతమంది మృతిచెందిందీ తెలియరాలేదు. అయితే ప్రమాద సమయంలో 48 మంది విమానంలో ఉన్నారని అందులో ఎవరూ ప్రాణాలతో ఉండే అవకాశం లేదని ఫైర్ సర్వీసు అధికారులు తెలిపినట్లు అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది. ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని మాత్రం ఆసుపత్రిలో చేర్చామని వారు విమానంలోనివారు కాదని మాత్రం పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న 12 ఇళ్లను ఖాళీచేయించారు.












Click it and Unblock the Notifications