వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిసి జాబితాలో మరో 10 కులాలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మరో పది కులాలను బిసిల్లో చేర్చుతూ శుక్రవారం రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకున్నది. అతిరాస, బుక్క అయ్యవార్లు, బొంట్రాళ్ళ తదితర పది కులాలను బిసిల్లో చేర్చడంతో పాటు బిసి-డిలో ఉన్న కొన్ని కులాలను బిసి-ఎకి మారుస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. కొన్ని కులాల ఫెడరేషన్‌లకూ ఆమోదం లభించింది.

అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం మంత్రి వర్గం సమావేశమై 50 కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోవడంతో ఎన్నికల సందడి కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. కులాల ప్రతిపాదికన తీసుకున్న నిర్ణయాలు, రాజుకున్న ఎన్నికల వేడికి నిదర్శనం. అదేవిధంగా ఉద్యోగులను, విద్యార్థులను ఆకర్షించే అనేక పథకాలకూ మంత్రివర్గం పచ్చజెండా ఊపింది.

ఇటీవల తరచూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్టీసి కార్మిక సంఘాలు చేస్తున్న సమ్మె హెచ్చ రికలను దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గం ఓ కీలక నిర్ణయం తీసుకున్నది. ఆర్టీసికి నేషనల్‌ బ్యాంకుల్లో ఉన్న రూ.144కోట్ల రుణాలకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని నిశ్చయించింది. ఈ మేరకు త్వరలోనే ఆర్టీసి రుణాలు తీసుకున్న బ్యాంకులకు హామీపత్రాలు పంపనున్నది.

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 692 పోస్టుల భర్తీతో పాటు వైద్య విధాన పరిషత్‌లో 48 పోస్టు ల భర్తీకి మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అదేవిధంగా పంచాయితీరాజ్‌ శాఖలో రద్దు చేసిన 600ఎఈ, ఎఈఈ పోస్టుల పునరుద్దరణ చేయాలని నిశ్చయించింది. ఇంకా ఒక సిఈ, 9ఎస్‌ఈ, 22ఈఈ పోస్టుల భర్తీకి కూడా మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్‌ లభించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X