బడ్జెట్ ఎన్నికల గారడీ: బిజెపి
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కొత్తదనమేదీ లేదని భారతీయ జనతా పార్టీ విమర్శించింది. ఎన్నికల కోసం అంకెల గారడీ చేసి చూపుతున్నారని, ఎన్నికల్లో లబ్ధి పొందే విధంగానే కేటాయింపులు ఉన్నాయని ఆ పార్టీ నేత విద్యాసాగర్‌రావు ఆరోపించారు.
2004 ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా అమలు చేశామనే ప్రణబ్ మాటల్లో నిజం లేదని ఆయన అన్నారు. అవాస్తవాలతో ప్రణబ్ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారని ఆయన విమర్శించారు. సత్యం కంప్యూటర్స్ సంస్థ చూపిన విధంగానే లేనిది ఉన్నట్లు చూపి భ్రమలు కల్పిస్తున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications