కర్నూలు: బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైలం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈరోజు ఉదయం నుంచి విశేషపూజలతో ఈ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. దాంతో రాష్ట్రం నలమూలల నుంచి వస్తున్న భక్తులతో ప్రాంతం రద్దీ ఎక్కువగా ఉంది. ఈ బ్రహ్మోత్సవాలు 11 రోజులపాటు జరుగుతాయి. ఈ ఉత్సవాల దృష్ట్యా ఆలయంలో ఆర్జిత సేవలన్నీ రద్దు చేశారు. తిరిగి 27నుంచి అన్ని సేవలు యధావిధిగా జరుగుతాయి.