Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రణబ్ ముఖర్జీ ప్రగతి బడ్జెట్

Pranab Mukherjee
న్యూఢిల్లీ: విదేశీ వ్యవహారాల మంత్రి ప్రణబ్ ముఖర్జీ సోమవారం లోకసభలో 2009 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ను ప్రతిపాదించారు. ప్రపంచవ్యాప్తంగా అలుముకున్న ఆర్థిక మాంద్యాన్ని ప్రస్తావిస్తూనే భారత ఆర్థిక వ్యవస్థ ప్రగతి పథంలో నడుస్తోందని చెప్పారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో భారత ఆర్థిక వ్యవస్థ రెండో స్థానంలో ఉందని చెప్పారు. ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేశామని ఆయన చెప్పారు. గత నాలుగేళ్లలో అన్ని రంగాల్లో ప్రగతి సాధించామని చెప్పారు. అయితే పారిశ్రామిక ఉత్పత్తి మాత్రం 2 శాతం తగ్గిందని చెప్పారు. దేశ చరిత్రలో మొదటిసారి వరుసగా మూడు సార్లు ఆర్థిక వ్యవస్థ ప్రగతి సాధించిందని చెప్పారు. వచ్చే ఏడాది కూడా ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం కొనసాగే అవకాశం ఉందని, దేశం దీన్ని తట్టుకోవడానికి ద్రవ్యవిధానంలో సవరణలు అవసరమని, కొత్తగా వచ్చే ప్రభుత్వం అందుకు పూనుకోవాలని ఆయన చెప్పారు. ముఖ్యాంశాలు -

- వరుసగా మూడేళ్లు 9 శాతం ఆర్థికాభివృద్ధి.
- 7-8 శాతం అభివృద్ధి లక్ష్యం.
- ఆర్థికమాంద్య ప్రభావం మనపై లేదు.
- జాతీయాదాయంలో వ్యవసాయవృద్ధిరేటు 11-14 శాతం.
- 2008లో 22.7 మిలియన్‌ టన్నుల గోధుమల పంపిణీ.
- 2008లో ప్రజాపంపిణీ ద్వారా 28.5 టన్నుల బియ్యం పంపిణీ.
- జాతీయ స్థూల పొదుపు ఆదాయం 2003-04లో 29.8 శాతంనుంచి 2007-08కి 30.7 శాతానికి పెరిగింది.
- పన్నులు, జీడీపీ నిష్పత్తి 2003-04లో 9.2 శాతం ఉండగా 07-08కి 4.5 శాతానికి పెరిగింది.
- ఆహారధాన్యాల ఉత్పత్తి ఏటా కోటి టన్నుల పెంపు.
- 2007-08కి 230 మిలియన్‌ టన్నుల రికార్డుస్థాయి ఆహారధాన్యాల ఉత్పత్తి.
- పెట్టుబడుల వృద్ధి 26.9 శాతంనుంచి 39 శాతానికి పెంపు.
- జీడీపీలో 9 శాతం ఎప్‌డీఐలు వచ్చాయి.
- 07-08లో 45 శాతం వృద్ధితో 34.28 బిలియన్‌ డాలర్ల విదేశీపెట్టుబడులు దచ్చాయి.
- ద్రవ్యోల్బణం 2009కి 4.4 శాతానికి తగ్గింది.
- వ్యవసాయం, సేవలు, తయారీ రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించాం.
- విద్యారుణ పథకాన్ని సవరిస్తాం. గత నాలుగేళ్లలో విద్యారుణాలను 4 రెట్లు పెంచాం.
- కొత్తగా 15 కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తాం.
- మరో రెండు ఐఐటీలను ఏర్పాటు చేస్తాం.
- ఈ ఏడాది ఆరు ఐఐటిలు పని చేయడం ప్రారంభించాయి.
- వ్యవసాయానికి 350 శాతం నిధులు పెంచాం.
- 67,700 కోట్లతో 50 మౌలిక వసతుల ప్రాజెక్టులకు సూత్రప్రాయ అంగీకారం తెలిపాం.
- కీలక ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టుల వాణిజ్య రుణాల్లో 60 శాతం ఐఐఎఫ్ సి భరిస్తుంది.
- ఇందిరా ఆవాస్ యోజన కింద 60 లక్షల ఇళ్లు నిర్మించాం.
- దేశీయంగా పెట్టుబడులు పెంచాం.
- 45 శాతం వృద్ధి రేటులో 34.28 శాతం విదేశీ పెట్టుబడులు వచ్చాయి.
- ఆహార ధాన్యాల ఉత్పత్తి యేటా కోటి టన్నులు పెరిగి 230 మిలియన్ టన్నుల రికార్డు స్థాయికి చేరుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+