జానా ఎదుట సాంబశివుడి లొంగుబాటు
హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన సాంబశివుడిని రాష్ట్ర హోం మంత్రి కె.జానారెడ్డి సమక్షంలో మీడియా ముందు హాజరు పరిచారు. కోనాపురి ఐలయ్య అలియాస్ సాంబశివుడు ఆదివారంనాడే పోలీసులకు లొంగిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే సోమవారం మధ్యాహ్నం క్రిక్కిరిసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో జానారెడ్డి సాంబశివుడి లొంగుబాటును ప్రకటించారు. ప్రస్తుతం సాంబశివుడు మావోయిస్టు కర్ణాటక రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నట్లు మాత్రమే ఇప్పటి వరకూ అందరికీ తెలిసిన విషయం.
నల్లగొండ జిల్లా దాసిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన సాంబశివుడు సంచలనాలకు ప్రతీకగా నిలిచాడు. ఆయనపై 80కి పైగా కేసులున్నాయి. గత 16 ఏళ్లుగా ఆయన మావోయిస్టు నేతగా అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన సోదరుడు రాములు గతంలో పోలీసులకు లొంగిపోయారు. సాంబశివుడిపై గల కేసుల విషయాన్ని అధికారులు పరిశీలిస్తారని జానారెడ్డి అన్నారు. లొంగిపోయిన ఇతర నక్సలైట్ల విషయంలో వ్యవహరించినట్లుగానే సాంబశివుడి విషయంలో వ్యవహిరిస్తామని ఆయన చెప్పారు. నక్సలైట్లు హింసామార్గం వీడి జనజీవన స్రవంతిలోకి రావడం మంచిదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications