• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాలీవుడ్ 'ఐశ్వర్య' వంతురాలు

By Staff
|

Aishwarya Rai
న్యూయార్క్‌: ఫోర్బ్స్‌ మేగజీన్‌ విడుదల చేసిన ఓ జాబితాలో 'బాలీవుడ్‌లో అత్యంత విలువైన నటి'గా ఐశ్వర్య ఎంపికయ్యారు. ఖాన్‌ త్రయం షారుక్‌, అమీర్‌, సల్మాన్‌ను తోసిరాజని ఆమె ఈ గౌరవం దక్కించుకోవడం గమనార్హం. తాజాగా ఫోర్బ్స్‌ 'హాలీవుడ్‌ అత్యంత విలువైన నటులు' జాబితాను విడుదల చేసింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1,411 మంది నటులకు వినోద పరిశ్రమకు చెందిన దిగ్గజాలు ర్యాంకులు ఇచ్చారు. అంతర్జాతీయంగా వారి విలువ, చిత్ర ఆర్థిక విజయానికి అదే మేరకు దోహదపడుతుందన్న అంశాలు ఆధారంగా మార్కులు కేటాయించారు. ఈ జాబితాలో ఐశ్వర్యరాయ్‌ 387వ స్థానంలో నిలిచారు.

బాలీవుడ్‌ నటులు అమీర్‌ఖాన్‌(540), షారుక్‌ఖాన్‌(735), సల్మాన్‌ఖాన్‌(753), ఇర్ఫాన్‌ఖాన్‌(825), హృతిక్‌ రోషన్‌(1059)లకూ ఇందులో చోటు దక్కింది. మొత్తం పదికి పది మార్కులతో హాలీవుడ్‌ మెగాస్టార్‌ విల్స్‌ స్మిత్‌ జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. జానీ డెప్‌, బ్రాడ్‌పిట్‌, లియనార్డో డికాప్రియో, ఏంజెలీనా జోలీలు రెండోస్థానంలో ఉన్నారు. టామ్‌ హాంక్స్‌, జార్జ్‌ క్లూనీ, డెంజెల్‌ వాషింగ్టన్‌, జాక్‌ నికోల్సన్‌ పేర్లు టాప్‌టెన్‌లో చోటు చేసుకున్నాయి. ఫోర్బ్స్‌ జాబితా కోసం 2008 సెప్టెంబరు, నవంబరు నెలల్లో ఈ సర్వేను నిర్వహించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X