అజర్ పై కేసులు లేవు: మొయిలీ

Mohammed Azharuddin
న్యూఢిల్లీ: మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు సంబంధించి అజహర్‌పై దేశంలో ఎక్కడా కేసుల్లేవని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ తెలిపారు. తనను నిషేధించిన బీసీసీఐపై అజరే ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారని చెప్పారు. వీరప్పమొయిలీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి.శ్రీనివాస్, కాంగ్రెస్ నేత వి. హనుమంతరావుల సమక్షంలో భారత మాజీ క్రికెటర్ అజరుద్దీన్ గురువారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌లో చేరేందుకు ఇరవై రోజులనాడు అజహర్‌ సంసిద్ధత తెలిపారని, సోనియాకు ఆ విషయం చెప్పారని, ఆమె సంతోషంగా అంగీకరించారని వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీని, స్వాతంత్య్ర సంగ్రామంలో ఆ పార్టీ పాత్రను, దాని లౌకిక విలువలను అజహర్‌ విలేకరుల సమావేశంలో కొనియాడారు. తానెప్పుడూ కాంగ్రెస్‌ అభిమానినని, గతంలో రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో సీనియర్‌ నేత వి.హనుమంతరావుకు ఓటేశానని చెప్పారు. 1985లో తాను క్రికెట్‌లో ప్రపంచరికార్డు బద్దలు కొట్టినప్పుడు నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ మొదటగా ఫోనుచేసి శుభాకాంక్షలు చెప్పారన్నారు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలను విలేకరులు ప్రస్తావించగా..విమర్శించేవారు ఎప్పుడూ ఉంటారని, కొన్నిసార్లు కళ్లూ చెవులూ మూసుకోక తప్పదని అజహర్‌ బదులిచ్చారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, దానిని ఎదుర్కోవడానికే పార్టీలో చేరారా అని ప్రశ్నిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్‌పై వ్యతిరేకత లేదని, పటిష్ఠంగా ఉందని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్‌ నియోజకవర్గం నుంచి పోటీచేస్తారా అని అడిగితే పార్టీయే నిర్ణయిస్తుందని బదులిచ్చారు. 'నేనిప్పుడు కెప్టెన్‌ను కాను. ఆటగాడిని మాత్రమే. నా అంతట నేను నిర్ణయించుకోలేను. పోటీచేయడానికి నేను అర్హుడినని పార్టీ భావిస్తే నేను కట్టుబడి ఉంటా. ఇప్పటికైతే నాకేమీ తెలియదు. పార్టీ కోసం ఏ స్థాయిలో పనిచేసేందుకైనా సిద్ధం' అని చెప్పారు. ఎవరితోనో పోటీపడేందుకు తాను రాజకీయాల్లో చేరడం లేదన్నారు. దేశానికి ఎంతోకొంత సేవ చేసేందుకే వచ్చినట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+