కర్నాటకలో పోటీ చేస్తా : చిరు
కర్నూల్ :ప్రజారాజ్యం తరపున కర్నాటకలో పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నామని పార్టీ అగ్రనేత చిరంజీవి ప్రకటించారు. అలాగే తెలుగు వారు ఎక్కువగా ఉండే మిగతా రాష్ట్రాల్లో కూడా పోటీ చేసే ఆలోచనలో ఉన్నామని ఆయన వివరించారు. కర్నూల్ జిల్లా ఆలూరు లో రోడ్‌షో నిర్వహించిన చిరు అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు.ఇక రాష్ట్రంలో హంగ్ అసలు రాదని ఒకే పార్టీకి ప్రజలు పట్టంకడతారని చిరంజీవి చెప్పుకొచ్చారు. అంతేగాక ప్రస్తుతం ఉన్న అవినీతి ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications