హైదరాబాద్: ప్రముఖనటుడు అమితాబ్ బచ్చన్ ఆదివారం రాత్రి పాత నగరంలో దర్శనం ఇచ్చారు. చార్మినార్ వద్ద జరిగిన సినిమా షూటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. షూటింగ్‌కు ఇబ్బంది లేకుండా అర్థరాత్రి తరువాత చేసినా ఎలాగో విషయం తెలుసుకున్న అభిమానులు పెద్దసంఖ్యలో ఆయనను చూసేందుకు పోటీపడ్డారు.