స్విస్ ఖాతాల ఆరా తీయండి: సిపిఎం
న్యూఢిల్లీ: స్విస్‌బ్యాంకుల్లో అక్రమంగా దాచుకున్న భారతీయుల ఖాతా వివరాలను తెలుసుకునేందుకు కేంద్రం కోరాలని సీపీఎం డిమాండ్ చేసింది. స్విస్ బ్యాంకుల్లోని అకౌంట్ల వివరాలకు సంబంధించిన సమాచారాన్ని ఇస్తామని అమెరికాకు స్విస్ బ్యాంకులు తెలిపాయని అదే కోవలో మనకు సమాచారాన్ని ఇచ్చేందుకు కేంద్రం తగుచర్యలు తీసుకోవాలని సీపీఎం పొలిట్‌బ్యూరో కోరింది. దేశంలోని అనేకమంది పన్నులు ఎగవేయడమే కాకుండా అక్రమమార్గాల ద్వారా పోగుచేసిన ప్రజాసొమ్మును స్విస్‌బ్యాంకులకు తరలిస్తున్నారని సీపీఎం ఆరోపించింది.












Click it and Unblock the Notifications