పవన్ మీ అడ్డాకెళ్ళి...అరవింద్ విమర్శ

పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి 'ఎక్కడ పడుకున్నావ్..కల్లు త్రాగి తొంగున్నావ్' అంటూ రాఘవులు చేసిన వ్యాఖ్యలను అరవింద్ దుయ్యబట్టారు. రాఘవుల వ్యాఖ్యలు వింటుంటే తనకే సిగ్గేస్తోందని దుయ్యబట్టారు. 'సార్! ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా స్వేఛ్ఛగా మాట్లాడుకోవచ్చు సార్! మీ కూటమి ప్రజల్లోకి వెళ్లలేకపోతోందని, అదే సమయంలో పీఆర్పీ దూసుకెళుతోందని మీకు అసూయ. సిద్ధాంతాల మేరకే మీరు టీడీపీతో చేతులు కలిపారా? మేమైతే వ్యక్తిగత కారణాలతో కలిపారని సందేహిస్తున్నాం అన్నారు. మహా కూటమి'తో సీపీఎం పొత్తు వెనుక అసలు ఎజెండా వెల్లడించడానికి తనకు సంస్కారం అడ్డొస్తోందన్నారు.
అలాగే బషీర్‌బాగ్ మృతుల తల్లిదండ్రుల కంటతడికి మీరేం సమాధానం చెబుతారు? బాబుపై మీరు రాసిన పుస్తకాన్ని తిరగరాస్తారా? లేక మేమే మీ పొత్తులపై పుస్తకాన్ని ముద్రించమంటారా? 'నన్ను క్షమించండి...ఆరోజు అబద్ధలు రాశాను' అని చెప్పండి. మీ స్థాయికి, వయస్సుకి, పరిజ్ఞానానికి పొంతన లేకుండా మాట్లాడిన మాటలకు నేను సిగ్గుపడుతున్నాను..అంటూ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications