ప్రజా ప్రతినిధి శృంగారం..కలకలం
అమలాపురం: పెరిగిన టెక్నాలిజి అన్ని విషయాల్లోనూ ప్రధాన పాత్ర వహిస్తోంది. తాజాగా అమలాపురంకు చెందిన ఓ ప్రజాప్రతినిధి రాజకీయ భవిష్యత్ ని నిర్ణయించే స్దితికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధి అక్కడి లోకల్ మహిళతో జరిపిన శృంగార దృశ్యాలు బయటకు వెల్లడికావడం తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో కలకలం రేపుతోంది. మొబైల్ ఫోన్లు, సీడీలు, నెట్‌లలో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు ఈ దృశ్యాలను పెట్టడం అంతటా చర్చనీయాంశంగా మారింది.
ఈ సంఘటన జరగటానికి దారితీసిన కారణాలు ఇలా ఉన్నాయి. అమలాపురం మండలంలోని ఓ అతిథి గృ హంలో ఇటీవల సర్వసమ్మేళనం పేరుతో ఓ ఘనమైన కార్యక్రమం జరిగింది. అక్కడ జరిగిన కొన్ని కార్యక్రమాలుకు సాక్ష్యంగా ఈ వీడియాలు బయిటకు వచ్చాయని సమాచారం. ఇవన్నీ అక్కడ తీసిన దృశ్యాలేనని అంతా నిర్దారిస్తున్నారు. ఈ సమ్మేళనంలో చాలామంది నాయకులు, ప్రముఖులు పాల్గొన్నా, సదరు ప్రజాప్రతినిధి రాజకీయ భవితవ్యాన్ని దెబ్బచేసే లక్ష్యంతోనే వీటిని విడుదల చేశారని అనుకుంటున్నారు. ఏదైమైనా రాబోయే ఎన్నికలను దగ్గరపెట్టుకునైనా నాయకులు తమ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మెలగటం మేలని సీనియర్స్ ఈ సంఘటనపై కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications