రెహమాన్ కి ఘన స్వాగతం

ఇక ఎయిర్‌పోర్టులో దిగిన ఆయనకు బాల్యమిత్రుడు శివమణి తన బృందంతో కలిసి 'జయ హో' గీతాన్ని డ్రమ్‌లపై పలికిస్తూ వినూత్న ఆహ్వానం కలిపారు. భారీ డ్రమ్‌ను వాయిస్తూ ఎయిర్‌పోర్టు బయట వరకు తోడ్కొని వచ్చారు. తోటి కళాకారులు, నటులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల శుభాకాంక్షలు, అభినందల మాలలతో రెహమాన్ ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రేమాభిమానాలతో తనను దాదాపు చంపేశారని నవ్వుతూ మీడియాతో అన్నారు. అలాగే, 'స్లమ్ డాగ్..' చిత్రంతో ప్రపంచం దృష్టిని కట్టి పడేసిన ముంబై మురికివాడకు చెందిన బాల నటులను ముంబై ఎయిర్‌పోర్టులో పుష్ప మాలలతో ముంచెత్తారు.
అలాగే మరో ఆస్కార్ విజేత, సౌండ్ మాంత్రికుడు రసూల్ పోకుట్టి, నటుడు ఇర్ఫాన్ ఖాన్‌కు కూడా అదే స్థాయిలో స్వాగత సత్కారాలు లభించాయి. ఆస్కారులను అందుకున్న వేళ కన్నతల్లిని చెమర్చిన నేత్రాలతో గుర్తు చేసుకొన్న రెహమాన్..జన్మభూమిని కూడా సమున్నతంగా స్మరించుకొన్నారు. తనకు లభించిన పురస్కారాలను భారతీయ కళాకారులకు అంకితం చేస్తున్నట్టు ప్రకటించి..దేశీయ చిత్ర పరిశ్రమకు ఎనలేని గౌరవం కల్పించారు.
గురువారం చెన్నైలో అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల ఆనందోత్సహాల మధ్య తన నివాసంలో రెహమాన్ మీడియాతో మాట్లాడారు. భారతీయ సినిమాకు ఉజ్వల భవిష్యత్ ఉన్నదని, రానున్న కాలంలో మరిన్ని ఆస్కారులు వరించడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. అవార్డు పొందడం కన్నా, ఆ వేదికపై స్టేజ్ షో ఇవ్వడం తనకు ఆనందం కలిగించిందని చెప్పారు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
ట్రంప్‌కు తలనొప్పి.. పుతిన్‌కు పండగ!: భారత్, చైనాకు రష్యానే దిక్కు! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
T20 world cup లో తెలివి తక్కువ జట్టు అదే-ఇండియా నాకౌట్ ఛాన్స్ మిస్ ? -
‘బ్లాక్’ దందా: గ్యాస్ సిలిండర్ కావాలంటే రూ. 3,000 నుంచి రూ. 5,000 ఇవ్వాల్సిందే ! -
బాగా పెరిగిన వంటనూనెల ధరలు.. కారణం ఇదే! -
గుడ్ న్యూస్: భారత్ కోసం ఇరాన్ కీలక నిర్ణయం! -
అటుకులు.. చెప్పలేనన్ని ప్రయోజనాలు -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి!












Click it and Unblock the Notifications