బాబుతో బాలకృష్ణ గుసగుసలు

ఈ నెల 8 నుంచి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తలపెట్టిన పర్యటనపై చర్చ జరిగింది. తొలి విడత పర్యటనలో దొర్లిన లోపాలు పునరావృతం కాకుండా చూడాలని బాలయ్య అందరికీ సూచించారు. ఈలోగా ఎన్నికల నిబంధనావళి అమల్లోకి రానున్న నేపథ్యంలో తన పర్యటన సమయంలో పార్టీ నాయకులు నిబంధనలను పక్కాగా అనుసరించి ఏర్పాట్లు చేయాలని బాలయ్య సూ చించారు.
అయితే బాలకృష్ణ పర్యటన వాయిదా పడే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. మహాకూటమి ఈ నెల 9న హైదరాబాద్ పరిసరాల్లో 'మహా'గర్జన నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో..బాలయ్య పర్యటన వాయిదా వేయాలన్న సూచన వచ్చింది. గర్జన ఏ ర్పాట్లలో పార్టీ యంత్రాంగం తలమునకలై ఉండే పరిస్థితుల్లో బాలయ్య పర్యటన ఏర్పాట్లు కష్టమవుతాయని నేతలు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications