మహబూబ్ నగర్: టీడీపీ మహిళానేత రోజా, పీఆర్పీ మహిళానేత శోభారాణిల మధ్య చోటుచేసుకున్న మాటల యుద్ధాలు తనను ఎంతో బాధించాయని, శోభారాణిని తాను మందలించానని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఈరోజు అచ్చంపేటలో మీడియాతో మాట్లాడుతూ విమర్శలు ఒక స్థాయి దాటి వ్యక్తిగత దూషణల స్థాయికి చేరాయని అన్నారు. అవతలివారు అంటేనే దానికి ప్రతిస్పందన ఉంటుంది తప్ప ఏకపక్షంగా విమర్శలు జరగలేదని వ్యాఖ్యానించారు. క్షమాపణలు అవతలివారు చెబితే ఇవతలివారు కూడా చెబుతారని ఓ వైపే క్షమాపణలు అడగటం సబబుకాదని ఆయన అన్నారు.