ఇంకా రగులుతున్న ఎమ్మార్పీస్ సెగ
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ పోరాట సమితి ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఈరోజు బంద్ జరుగుతోంది. ఎమ్మార్పీఎస్ కార్యకర్త సురేందర్ మాదిగ మృతికి నిరసనగా ఆంధ్రా యూనివర్శిటీ, నాగార్జున యూనివర్శిటీ, ఉస్మానియా, కాకతీయ యూనివర్శిటీల్లో ఈరోజు బంద్ జరుగుతోంది.
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. బస్సులను అడ్డుకోవటంతో నూజివీడు డిపో పరిధిలో ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు నానా పాట్లు పడ్డారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications