విజయశాంతికి రెండు'పాత్రలు'

ఈ పదవులు విజయశాంతికి తక్కువేనని..ఆమె తన పదో చెల్లెలని కేసీఆర్ పునరుద్ఘాటించారు. తెలంగాణ వ్యాప్తంగా విజయశాంతి సుడిగాలి పర్యటనలు చేస్తారన్నారు. విలీనం తర్వాత ఆమె పార్టీ కార్యాలయానికి రావడం ఇదే ప్రథమం. అప్పటికే పార్టీ కార్యాలయంలో ఉన్న కేసీఆర్‌ను ఆమె కలుసుకున్నారు. అనంతరం కేసీఆర్, పార్టీ సిద్ధాంతకర్త జయశంకర్ వెంటరాగా తెలంగాణ భవన్ ఆవరణలోని తెలంగాణతల్లి విగ్రహానికి పూలమాల వేశారు. తర్వాత విజయశాంతికి ప్రత్యేకంగా కేటాయించిన చాంబర్‌కు కేసీఆర్ ఆమెను తీసుకు వెళ్లి నూతన బాధ్యతలను అప్పగించారు.












Click it and Unblock the Notifications