హైదరాబాద్: సినీ నటుడు, టీడీపీ నేత బాలకృష్ణపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం ప్రభుత్వ కక్ష సాధింపు చర్యేనని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. సోమవారమిక్కడ ఆయన ఒక ప్రైవేటు టీవీ చానల్ కార్యక్రమంలో మాట్లాడారు. బాలకృష్ణపై కేసులు ప్రభుత్వం కావాలని చేసిన దుర్మార్గమని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఒక వినూత్న పథకాన్ని చేర్చబోతున్నామన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏ హోదాలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఆయన ప్రశ్నించారు.