లంక జట్టుపై దాడికి భారత్ ఖండన

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లో శ్రీలంక క్రికెటర్లపై దుండగులు చేసిన దాడిని భారత్ ఖండించింది. గాయపడిన ఆటగాళ్లు త్వరగా కోలుకోవాలని బీసీసీఐ ఆశిస్తున్నట్లు తెలిపింది. ఆ దాడిపై భారత హోంమంత్రి చిదంబరం ఖండించారు.మరోవైపు లంక క్రికెటర్లపై దాడిని క్రికెట్‌ ఆస్ట్రేలియా దిగ్భ్రాంతి వ్యక్తిం చేసింది. ఈలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని సీఏ సీఈవో జేమ్‌‌స సుదర్లాండ్‌ అన్నారు. లంక ఆటగాళ్లు త్వరగా కోలుకోవాలని అన్నారు. ఈ ఘటన పట్ల న్యూజిలాండ్‌లో ఉన్న భారత ఆటగాళ్లు విచారం వ్యక్తం చేశారు. ఆ దాడికి నిరసనగా భారత-న్యూజిలాండ్‌ ఆటగాళ్లు నల్ల బ్యాడ్జిలు ధరించి మైదానంలోకి దిగారు. ఇక పాకిస్థాన్‌లో ఏ జట్టు పర్యటించదని ఆ దేశ మాజీ కెప్టెన్‌ ఇంజుమామ్‌ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+