చిరుకి ధీటుగా బాలయ్య పర్యటన

ఈ కార్యక్రమంలో సోమిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 8 నుంచి 11 వరకు బాలయ్య పర్యటన ఉంటుందని తెలిపారు. ఇక చిరుకి ధీటుగా బాలయ్య పర్యటన ఉండేందుకు..చిరంజీవి పర్యటన ఏయే మార్గాలలో ఉన్నదో అదే మార్గంలో వస్తూ అదనంగా మరికొన్ని ప్రాంతాలను కలుపుతూ పర్యటన మ్యాప్‌ను తయారు చేశారు. ఆ టూరు వివరాలు ఇలా ఉన్నాయి..ఉదయగిరి మీదుగా కావలి వరకు నాలుగు రోజులు పర్యటన సాగుతుంది. నెల్లూరుసిటీ, రూరల్ నియోజకవర్గంలో ఒక రోజు పూర్తిగా పర్యటనను ఏర్పాటు చేస్తున్నారు. పర్యటనలో ఆయా నియోజకవర్గ టిక్కెట్లు ఆశిస్తున్న నాయకులతో పాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ మెంబర్లు బాలయ్య రోడ్ షో వాహనంలో ఎక్కాలని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications