సినిమా హిట్‌ అయ్యాక..పవన్

Pawan Kalyan
నల్గొండ: సినిమా హిట్‌ అయ్యాక 100 రోజుల కార్యక్రమం చేసే బదులు ఆ డబ్బుతో ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ప్రయత్నించా. సర్వే చేయడానికి వస్తే స్థానిక ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల రాజకీయాల వల్ల ఆగిపోయా..ప్రజా రాజా పార్టీ అధికారంలోకి వస్తే మీ పక్షాన పోరాడుతుంది. నల్గొండ జిల్లా మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లో యువరాజ్యం అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటించారు. ఈ సందర్భంగా స్దానిక సమస్యలపై మాట్లాడుతూ...సమస్యలను ప్రజారాజ్యం మ్యానిఫెస్టోలో పెడతామని పవన్ పేర్కొన్నారు.

అలాగే కుదాబక్షిపల్లిలో ఫ్లోరైడ్‌ బాధితులతో, దేవరకొండలో శిశు విక్రయాలు చేసిన గిరిజన మహిళలతో పవన్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారితో ..నల్గొండ జిల్లాలో తాగు, సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తాం. అధికారం, పదవులు, డబ్బులు ముఖ్యం కాదు. మూడు తరాల గురించి ఆలోచిస్తున్నాం. ఫ్లోరైడ్‌ సమస్య పరిష్కారమైతే నా జీవితం ధన్యమైనట్లే. ఇంతవరకు అధికారం ఇచ్చిన నాయకులను ఈ సమస్యకు శాశ్వత నివారణ ఎందుకు చూపలేదో నిలదీయండి. వారిచ్చే సమాధానాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి. మీ మనస్సాక్షిగా మంచి అనిపిస్తే..అన్నయ్య (చిరంజీవి)పై నమ్మకం ఉంటే.. ప్రరాపా చేస్తుందనిపిస్తే మద్దతు ఇవ్వండి అన్నారు.

అంతేగాక లక్ష కోట్ల బడ్జెట్‌లో గిరిజనులకు న్యాయం జరగలేదు..అభివృద్ధి చెందామని గొప్పలు చెప్పుకోవడం కాదు. గిరిజన తండాల్లో శిశు విక్రయాలు పాలకుల కళ్లకు కనిపించడం లేదా..నాయకుల ఇళ్లు, సన్నిహితులు అభివృద్ధి చెందారు. ప్రాణం చిటికెలో పోతుంది..ఎంత సంపాదించినా..చివరికి గోతిలో పోవాల్సిందే. ప్రజాధనాన్ని దోచి సొంత ఆస్తులను పెంచుకుంటున్నారు. కాగ్‌ తిట్టినా సిగ్గు లేకుండా దోపిడీ, తప్పులు చేస్తున్నారు.

నల్గొండ జిల్లాలో ఏడు లక్షల మందిని వేధిస్తున్న సమస్య ఫ్లోరైడ్‌..సీఎం సొంత జిల్లా అయితే ఇలా ఉండేదా?..ఇక్కడి ఫ్లోరైడ్‌ సమస్య ఎన్ని ఏళ్లకి పోతుంది?..ఎవరో చేయాల్సిన అక్కర లేదు. కృష్ణా జలాల సరఫరాతో తాగునీటికి శాశ్వత పరిష్కారం మనమే సాధించుకుందాం అని పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+