ప్రేమించలేదని వేడినూనెతో దాడి
రాజమండ్రి: ఇది మరో ప్రేమోన్మాదం. ఎంతోకాలంగా వెంటపడుతున్నా తనను ప్రేమించటంలేదంటూ ఓ యువకుడు తాను ప్రేమించిన యువతి ముఖంపై వేడినూనె పోసిన ఘటన తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చెందుర్తిలో జరిగింది. రవిబాబు అనే ఇంటర్ విద్యార్థి అదే కాలేజీకి చెందిన చిన్నారి అనే యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటబడుతుండటంతో చాలాకాలంగా గొడవలు జరుగుతున్నాయి.
ఇటీవల అతని వేధింపులు భరించలేక ఆమె కాలేజీ మానేసింది. దీంతో రవిబాబు రాత్రి ఆమె ఇంట్లోకి ప్రవేశించి నిద్రిస్తున్న చిన్నారి ముఖంపై వేడినూనె పోశాడు. ఆ వెంటనే పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రిలో చేర్చారు.












Click it and Unblock the Notifications