కాంగ్రెస్ కు త్రిష గ్లామర్

చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ తో హేమాహేమీగా జరుగుతున్న ఈ పోరులో ఇటువంటి మరికొంతమంది ఆకర్షణ గల హీరోయిన్ల ప్రచారం తప్పనిసరి అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అంతేగాక ఆమెతో పాటు మరికొంతమంది హీరోయిన్లు,హాస్యనటులను బరిలోకి దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఇక ఎలాగో నాగార్జున కాంగ్రెస్ తరుపున ప్రచారానికి నడుం బిగించటానికి రెడీ అవుతున్నారు. ఇందునిమిత్తం ఆయన ముఖ్యమంత్రిని నిన్న(గురువారం) కలిసారు. ఆయన నేరుగా ప్రచారం చేయకున్నా ఆయన అభిమాన సంఘాలు కాంగ్రెస్ తరుపున పనిచేసేటట్లు మాట తీసుకున్నారని సమాచారం. ఇదే అంశం పై వైయస్ తో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications