మాది విజన్, బాబుది టెలివిజన్: చిరు

ఉమ్మడిగుర్తు రానందున జాతీయపార్టీ అయిన ఎన్సీపీ గుర్తుపై ప్రజారాజ్యం పోటీచేస్తుందని వస్తున్న వార్తలను చిరంజీవి ఖండించారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఈరోజు మీడియతో మాట్లాడుతూ ఉమ్మడిగుర్తు రాకపోతే ఏ పార్టీ గుర్తు అయినా తీసుకుని పోటీచేయాలని తాము భావించి సంప్రదింపులు జరిపిన మాట వాస్తవమేనని ఆయన అన్నారు. ఎన్సీపీ మరికొన్ని పార్టీలు అందుకు అంగీకరించాయని అయితే దానివల్ల వచ్చే సాధకబాధకాలను కూడా పరిశీలించామని అన్నారు. ఎన్సీపీతో కలిసి తాము పోటీచేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications