తెలంగాణ నుంచి కూడా పోటీ: చిరు

తెలంగాణపై తమకు స్పష్టత లేదని కొందరు విమర్శిస్తున్నారని, ఏ పదాలు ఉపయోగిస్తే స్పష్టత ఉంటుందో చెబితే తమ మేనిఫెస్టోలో ఆ పదాలు ఉపయోగిస్తామని ఆయన శనివారం ఉదయం మీడియా సమావేశంలో అన్నారు. ఉమ్మడిగుర్తు రానందున జాతీయపార్టీ అయిన ఎన్సీపీ గుర్తుపై ప్రజారాజ్యం పోటీచేస్తుందని వస్తున్న వార్తలను ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి ఖండించారు. ఉమ్మడిగుర్తు రాకపోతే ఏ పార్టీ గుర్తు అయినా తీసుకుని పోటీచేయాలని తాము భావించి సంప్రదింపులు జరిపిన మాట వాస్తవమేనని ఆయన అన్నారు. ఎన్సీపీ మరికొన్ని పార్టీలు అందుకు అంగీకరించాయని అయితే దానివల్ల వచ్చే సాధకబాధకాలను కూడా పరిశీలించామని అన్నారు. ఎన్సీపీతో కలిసి తాము పోటీచేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తమ అభ్యర్థుల తొలి జాబితాను ఈనెల 10న విడుదల చేస్తామని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications