తిరుమల: తిరుమలకు ఉగ్రవాదుల ముప్పు ఉందని కేంద్ర హోం మంత్రి చిదంబంరం చేసిన ప్రకటనతో టీటీడీ యంత్రాంగం అప్రమత్తమైంది. దీంతో టీటీడీ నిఘా, ముఖ్య భద్రతాధికారి రామకృష్ణ భధ్రతను కట్టుదిట్టం చేసారు. తిరుమల, అలిపిరి టోల్ గేట్లు, శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో తణిఖీలు ముమ్మరం చేశారు. రెండు ఘాట్ రోడ్లలో భద్రతను మరింత పెంచారు. ప్రత్యేకంగా అలిపిరి కాలిబాట. శ్రీవారి మెట్టు మార్గాలపై దృష్టి సారించారు. శ్రీవారి ఆలయం వద్ద ఏఆర్ కామాండ్ పహారాను మరింత అప్రమత్తం చేసారు. అదేవిధంగా శుక్రవారం సాయింత్రం టీటిడీ ఛైర్మన్ డీకే ఆదికేశవులు నాయుడు, ఈవో కేవీ రమాణాచారి, ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డి, సీవీ అండ్ ఎస్ వో రామకృష్ణ తదితరులు తాజా భద్రతా చర్యలపై చర్చించారు.