వైఎస్‌, సోనియా పిచ్చోళ్లు: కేసీఆర్‌

K Chandrasekhar Rao
మహబూబ్‌ నగర్‌: తెలంగాణ విషయంలో సోనియా, వైఎస్‌లు పిచ్చివాళ్ల లాగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌ విమర్శించారు. కండువాలు వేసుకొని తెలంగాణ ప్రజలను నమ్మించిన సోనియా, వైఎస్‌ లు తర్వాత నట్టేట ముంచారని ఆయన మండిపడ్డారు. శుక్రవారం మహబూబ్‌ నగర్‌ జిల్లా కోస్గి, అచ్చంపేటలలో జరిగిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల శిక్షణ శిబిరాలకు కేసీఆర్‌తో పాటు విజయశాంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు.

తెలంగాణ పట్ల కాంగ్రెస్‌, వైఎస్‌ల వైఖరిపై పిట్టకథ చెప్పారు. తెలంగాణ రావాలంటే కాంగ్రెస్‌ పోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయడానికి మహాకూటమిని గెలిపించాలని కోరారు. ఈ సారి లక్ష మంది రాజశేఖర్‌రెడ్డిలు అడ్డొచ్చినా మహాకూటమి విజయాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. చర్చల పేరుతో నక్సలైట్లను దారుణంగా చంపిన వైఎస్‌కు ఎమ్మార్పీఎస్‌పై ఎందుకు ప్రేమ ఉంటుందని ప్రశ్నించారు. తెలంగాణ కోసం తల నరుక్కుంటాను కాని తల దించనని స్పష్టం చేశారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ మాట్లాడుతూ తెలంగాణను అడ్డుకోవడానికే రోశయ్య కమిటీ వేశారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+