ఎన్‌టివీ సర్వేపై చిరు మండిపాటు

వచ్చే ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి 35 అసెంబ్లీ, ఒకటి-రెండు లోక్‌సభ సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందంటూ ఎన్టీవీ సర్వేను ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. ఈ సర్వేను పీఆర్పీ నేతలు తప్పుల తడకగా అభివర్ణించారు. మరీ ఇంత దారుణమా? ..ఆ సర్వే వెనుక ఉన్నదెవరో!? అన్న సందేహాన్ని చిరు వ్యక్తం చేశారు.
ఎన్టీవీ సర్వేలో కొద్దిమంది కాంగ్రెస్ మద్దతుదార్ల నుంచి మాత్రమే అభిప్రాయ సేకరణ చేశారన్నది వాస్తవమని, 180 నుంచి 225 సీట్లు పీఆర్పీ గెలుచుకుంటుందని, తెలంగాణలో సైతం 60-80 సీట్లు గెలుస్తామని యువరాజ్యం అధినేత పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు.
ఈ సర్వే విలువ లేనిదని, దాని గురించి నేను మాట్లాడదలచుకోలేదని పీఆర్పీ నేత అల్లు అరవింద్ పేర్కొన్నారు. ఆ ఛానల్ ఎవరిదో అందరికీ తెలుసని, రాష్ట్ర మంత్రి షబ్బీర్‌కు అందులో వాటా ఉందని, ఇది షబ్బీర్ సర్వే అని, చిరంజీవి సభలకు వస్తున్న జనంలో 20 శాతం మంది ఓటేసినా పీఆర్నీకి 200 సీట్లు రావడం ఖాయమని నేత రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు. అలాగే తమ విజయం ఎవరి అంకెలకు, సంఖ్యలకు చిక్కేది కాదని చిరంజీవి తేల్చి చెప్పారు. భయంతోనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రికి వాటా ఉన్న ఛానల్ సర్వే ఇంతకంటే భిన్నంగా ఎలా ఉంటుందని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications