హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ నేత చిరంజీవిని విమర్శించేందుకే మేస్త్రీ సినిమాను తీశారంటూ చిరు అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా థియేటర్ల వద్ద ఆందోళన చేస్తున్నారు. పలమనేరులో, విజయవాడలో చిరంజీవి అభిమానులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరులో శుక్రవారం మేస్త్రీ సినిమా పోస్టర్‌పై వున్న దాసరి నారాయణరావు ఫోటోను చెప్పులతో కొట్టారు. అనంతరం దాసరి చిత్రం ఉన్న పోస్టర్లను దగ్ధం చేశారు. నిరసన కార్యక్రమంలో గంటావూరు శశి, బాబు, శ్రీనివాసాచారి, రాజేష్, రెహమాన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.