వెబ్ సైట్ ద్వారా ఓ అధికారి వ్యభిచారం
విశాఖపట్నం: దేశాన్ని రక్షించాల్సిన నౌకాదళం అధికారి వ్యభిచార గృహాలు నిర్వహిస్తూ డబ్బు సంపాదించడం ప్రజలను నివ్వెర పరిచింది. విశాఖ నగరంలోని షీలానగర్ ప్రాంతం లో హైటెక్ వ్యభిచారం సాగిస్తున్న నావికాదళ అధికారి గుట్టు రట్టయ్యింది. ఇంటర్ నెట్‌లో 'సర్వీసెస్' పేరిట ఏర్పాటు చేసిన వెబ్ సైట్ ద్వారా హైటెక్ వ్యభిచారం సాగుతున్నట్టు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో ఆ అధికారి ఇంటిపై పోలీసులు శుక్రవారం రాత్రి దాడి చేశారు.
ఈ సందర్భంగా అధికారి సురేంద్రన్ సూరజ్‌తోపాటు అతని భార్య రేష్మా, మరో యువతి సుమను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో వున్న అశ్లీల చిత్రాల సీడీలు, కంప్యూటర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. గాజువాక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications