ఏలూరు: భాజపా నుంచి కాంగ్రెస్‌లో చేరతారనుకున్న సినీనటుడు కృష్ణంరాజు తాజాగా చిరు పార్టీ వైపు ఆసక్తి చూపుతున్నాడని అంతటా వినిపిస్తోంది. తనకి రాజకీయ ప్రాధాన్యత ఇచ్చే పార్టీలోనే చేరాలని కొనసాగాలని కృష్ణంరాజు నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతోంది. దాంతో ఈ వార్త పశ్చిమగోదావరి జిల్లాలో మరో ఆసక్తికర పరిణామయ్యేటట్లు కనపడుతోంది. అలాగే టీటీడి బోర్డు మాజీ సభ్యుడు, భీమవరం అసెంబ్లీకి కాంగ్రెస్ టికెట్ ఆశించిన గోకరాజు రామరాజు కూడా త్వరలోనే ప్రరాపాలో చేరతారని అంటున్నారు.