హైదరాబాద్: 'అబ్బో..నాకు జూనియర్ ఎన్‌టీ రామారావు అంటే భయం' అని ఆర్థిక మంత్రి రోశయ్య వెటకారం చేసారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేసారు. నడవలేని రోశయ్య జూనియర్ ఎన్టీఆర్‌కు సరిగా భయపడుతున్నారంటూ టీడీపీ నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన పైవిధంగా స్పందించారు. అవును నాకు ఎన్టీఆర్ అంటే భయమే. నిన్నే టీవీలో సాంబ సినిమా చూసాను. ఒక్క చేత్తో కొడితే దెబ్బకు వందమంది కిందపడి గిలగిల కొట్టుకుంటున్నారు..మరి నేనసలే ముసలాడినాయే. భయమెయ్యదూ..అన్నారు. ఎవరికి ఎవరంటే భయమో చరిత్ర తెలుసుకోవాలని ఆయన సూచించారు. అలాగే అసలు ఎన్టీఆరే నా దెబ్బకు భయపడిపోయాయి కౌన్సిల్ రద్దు చేసారు. ఈ ఎన్టీఆర్ ఎంత అన్నారు. మరో ప్రక్క ఎన్టీఆర్, చిరంజీవి వంటి తదితర ప్రతిపక్ష పార్టీల సినిమా హీరోల సినిమాలు టీవిల్లో ప్రసారం చేయటం ఆపాలంటూ ఎలక్షన్ కమీషన్ ని సంప్రదించారు.