రానున్నది టిడిపి ప్రభుత్వమే: ఎన్టీఆర్

ఇతర పార్టీలు అన్ని సీట్లు గెలుచుకుంటాం, ఇన్ని సీట్లు గెలుచుకుంటాం అని లెక్కలు చెపుతున్నాయని టిడిపి గెలుపు లెక్కలకు అందనిదని, అయితే ఖచ్చితంగా ఈ సారి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఆయన అన్నారు. నేను రాజకీయ నాయకుడిని కాదని కేవలం కార్యకర్తనేనని పార్టీకి నా అవసరం ఎప్పుడు ఉంటే అప్పుడు నా సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటానని ఆయన తెలిపారు. రాజకీయాలతో పాటు నా బతుకు తెరువైన సినిమారంగాన్ని కూడా చూసుకుంటానని ఆయన అన్నారు.
తన ప్రసంగాలు బాగున్నాయని అందరూ అంటున్నారని అయితే అందుకు ప్రత్యేకంగా ఏమీ శిక్షణ తీసుకోలేదని గుండెల్లో ఉన్నదే బయటకు వచ్చిందని ఆయన అన్నారు. నా ప్రసంగాలకు మా తాతే నాకు స్ఫూర్తని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటు వేయనివాడు రోడ్లు బాగోలేవని, రాష్ట్రంలో అవినీతి పేరుకుపోయిందని అనే హక్కు లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications