చిరంజీవి బస వద్ద ఘర్షణ
గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడలో చిరంజీవి బస వద్ద శుక్రవారం ఉదయం ఆయన అభిమానులకు, వ్యక్తిగత భద్రతాసిబ్బందికి మధ్య ఘర్షణ జరిగింది. మూడు రోజుల కృష్ణా జిల్లా పర్యటన ముగించుకున్న చిరంజీవి రాత్రి గుడివాడలో బస చేశారు. శుక్రవారం ఉదయం ఆయనను కలుసుకునేందుకు పాసులు ఉన్న అభిమానులను అనుమతించారు. అయితే వారు పెద్దసంఖ్యలో రావటంతో భద్రతాసిబ్బంది వారిని నియంత్రించలేక నెట్టివేశారు. దీంతో గొడవ మొదలై ఘర్షణగా మారింది. ఈ సమయంలో తోపులాట కూడా చోటు చేసుకుంది. చివరకు చిరంజీవి స్వయంగా బస్సు దిగి వచ్చి ఇరువర్గాలను శాంతింపజేశారు.












Click it and Unblock the Notifications