బాలయ్యవి పిల్ల చేష్టలు: దగ్గుబాటి

Daggubati Venkateswara Rao
హైదరాబాద్: సినీ నటుడు బాలకృష్ణవి పిల్ల చేష్టలని కాంగ్రెసు శాసనసభ్యుడు, ఆయన బావ డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు వ్యాఖ్యానించారు. తన ఇంటి ముందు బాలకృష్ణ తొడ కొట్టడంపై ఆయన ఆ విధంగా వ్యాఖ్యానించారు. నందమూరి కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలే ఉంటాయని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. తన మామ, తెలుగుదేశం వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా జరిగిన కుట్రలో తన భార్య, కేంద్ర మంత్రి పురంధేశ్వరి పాత్ర లేదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ప్రస్తుత తెలుగుదేశం నాయకుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు డబ్బులు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం పార్టీతో తన అనుబంధంపై దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకం రాశారు.

ఎన్టీ రామారావును గద్దె దించేందుకు అప్పట్లో తాను వైస్రాయ్ హోటల్ కు వెళ్లడం జీవితంలో తాను చేసిన పెద్ద తప్పు అని ఆయన అన్నారు. వైస్రాయ్ కి వెళ్లవద్దని పురంధేశ్వరి, శివశంకర్ కృష్ణ చెప్పినా తాను పెడచెవిన పెట్టానని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎన్టీ రామారావు కొనసాగుతారని, తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని, హరికృష్ణను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తానని చంద్రబాబు అప్పుడు హామీ ఇచ్చారని, ఆ హామీలను చంద్రబాబు తుంగలో తొక్కారని, తమను మోసం చేశారని ఆయన అన్నారు. తాను చంద్రబాబుతో జత కట్టి పెద్ద తప్పు చేశానని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+