గాంధీ తరహాలో జెపి రైలు ప్రచారం

Jayaprakash Narayan
హైదరాబాద్: లోకసత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ మహాత్మా గాంధీ తరహా ప్రచారాన్ని చేపట్టారు. రైల్లో ప్రయాణం చేస్తూ ప్రజలను కలుసుకునే కార్యక్రమానికి ఆయన శుక్రవారం శ్రీకారం చుట్టారు. దీనికి విజిల్ స్టాప్ విజిట్ అని పేరు పెట్టారు. ఇందుకు గాను ఆయన శుక్రవారం ఉదయం కృష్ణా ఎక్సుప్రెస్సు రైల్లో బయలుదేరారు. ఆయన కృష్ణా ఎక్సుప్రెస్ రైల్లో నెల్లూరు వరకు ప్రయాణిస్తూ రైలు ఆగిన చోట ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రైలు బోగీల్లో పార్టీ కార్యకర్తలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు.

ప్రజలను రాజకీయ బిచ్చగాళ్లుగా మార్చేసి బహిరంగ సభలకు రప్పించే రాజకీయ పార్టీలకు భిన్నంగా తామే ప్రజలకు వద్దకు వెళ్లే ఉద్దేశంతో ఈ ప్రచారాన్ని ఎంచుకున్నట్లు జయప్రకాష్ నారాయణ్ చెప్పారు. రాష్ట్రంలోని కొన్ని కుటుంబాలు రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేసి పబ్బం గడుపుకుంటున్నాయని ఆయన విమర్శించారు. వలసల నివారణకు చిన్న పట్టణాలను అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. తమకు అధికారం ఇస్తే ప్రజలను అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+