బూతులు మాకు రావా: జూ.ఎన్టీఆర్

Jr Ntr
విశాఖపట్నం: చేతులు తీయడం మాకు రాదా, బూతులు మాట్లాడడం మాకు రాదా అని జూనియర్ ఎన్టీఆర్ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. తమ సంస్కారం ఆ చేతలకు, ఆ మాటలకు దూరమని ఆయన అన్నారు. ఆయన రోడ్ షో శుక్రవారం కూడా విశాఖపట్నం జిల్లాలో సాగింది. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడిని పట్టుకుని కాంగ్రెస్ వారు చేతులు తీసేస్తామని, నిన్ను కన్నందుకు మీ అమ్మ సిగ్గు పడేలా చేస్తామని కాంగ్రెసు నాయకులు నిండు శాసనసభలో అన్నారని ఆయన చెప్పారు. అది కౌరవ సభనా, గౌరవ సభనా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెసు కుసంస్కారాన్ని దృతరాష్ట్రుడిలా చూస్తూ ఉండిపోయారని ఆయన అన్నారు.

కాంగ్రెసుకు సంస్కారం లేదని ఆయన చెప్పారు. పివి నర్సింహారావును తమ తాత ఎన్టీ రామారావు గౌరవించిన తీరును వివరిస్తూ ఆ సంస్కారం తెలుగుదేశం పార్టీకి ఉందని ఆయన చెప్పారు. కాంగ్రెసు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆయన విమర్శించారు. కాంగ్రెసువారు రాజకీయాలంటే విరక్తి కలిగేలా, అసహ్యం పుట్టేలా చేశారని ఆయన విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో అవినీతిమయమైన కాంగ్రెసు ఓడించి, నీతివంతమైన తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెసు బెదిరింపులకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాలను అధికార కాంగ్రెసు పార్టీ బెదిరిస్తోందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+