కుటుంబమంతా ఒక్కటే: ఎన్టీఆర్

తన పర్యటన సందర్భంగా స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయన్నారు. ఈ వివరాలను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఈ అంశాలపై ఒక నివేదిక ఇవ్వాలని సూచించారని, అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని బాబు వెల్లడించారని ఎన్టీఆర్ చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని కొన్ని మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ విద్యుత్తు సరఫరా లేదని ఆవేదన వెలిబుచ్చారు. తాత(ఎన్టీఆర్) స్థాపించిన తెదేపాను మళ్లీ అధికారంలో తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే ప్రస్తుతం తన ముందున్న లక్ష్యమని తెలిపారు.












Click it and Unblock the Notifications