హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపితో సర్దుబాట్లు: సిపిఎం మెలిక

By Staff
|
Google Oneindia TeluguNews

BV Raghavulu
హైదరాబాద్: సీట్ల సర్దుబాటు విషయంలో మహాకూటమి భాగస్వామ్య పార్టీ సిపిఎం మెలిక పెట్టింది. తెలుగుదేశం పార్టీతో సీట్ల సర్దుబాటు పూర్తయినట్లు వచ్చిన వార్తలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఖండించారు. తమకు తెలుగుదేసం పార్టీ 16 శాసనసభా స్థానాలు కేటాయించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. తాము 20 స్థానాల నుంచి పోటీ చేస్తామని ఆయన చెప్పారు. ఆ స్థానాల జాబితాను కూడా తెలుగుదేం పార్టీకి అందజేశామని ఆయన చెప్పారు. ఆ జాబితాను ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో విడుదల చేశారు. తమతో తెలుగుదేశం పార్టీ సీట్ల సర్దుబాటు పూర్తయిందని ఎవరో వార్తను లీక్ చేసి ఉంటారని ఆయన అన్నారు.

వైరా, భద్రాచలం, మధిర, పాలేరు, మిర్యాలగూడెం, నల్గొండ, నకిరేకల్‌, వరంగల్‌ తూర్పు, ఇబ్రహీంపట్నం, పటాన్‌చెరువు, ఉప్పల్‌, సంతనూతలపాడు, నెల్లూరు రూరల్‌, అనంతపురం, కురుపాం, గాజువాక, ఆచంట, విజయవాడ సెంట్రల్‌, మంగళగిరి, తలపాడుల నుంచి తాము పోటీచేస్తామని ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X