చంద్రబాబు ఇంటి వద్ద ఆందోళన

ఇదిలా ఉంటే, తెలంగాణలో పలు నియోజకవర్గాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సీట్ల సర్దుబాటులో తమ పార్టీకి బలం ఉన్న సీట్లు కూడా మిత్రపక్షాలకు వెళ్లడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తోంది. టిక్కెట్లు ఆశించి భంగపడిన వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో పార్టీకి క్యాడర్ ఉందని, పునాది ఉందని, పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలను మిత్రపక్షాలకు కట్టబెట్టడం వల్ల పార్టీ తుడిచిపెట్టుకు పోతుందని వాదిస్తున్నారు. మొత్తం మీద తెలంగాణలో సీట్ల సర్దుబాటు పార్టీకి కష్టాలు తెచ్చే పెట్టే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications