తెరాస జాబితాలు: నిరసనల జోరు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీతో సీట్ల సర్దుబాటు పూర్తి కావడంతో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా స్థానాలకు తొలి జాబితాను విడుదల చేసింది. సిట్టింగులకు స్థానాలను ఖరారు చేస్తూ కొత్తవారికి కూడా తగిన ప్రాధాన్యం ఇచ్చింది. సీట్లు అశించి భంగపడినవారు బుధవారం ఉదయం తెరాస కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. వారికి సర్ది చెప్పడానికి నాయకులు ప్రయత్నిస్తున్నారు. తొలి జాబితాలో తమ పేర్లు లేని వారు ఆందోళనకు గురవుతున్నారు. బోథ్ టిక్కెట్టును తొలి జాబితాలో ప్రకటించలేదని ఆ నియోజకవర్గం కార్యకర్తలు తెరాస శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ తో వాగ్వివాదానికి దిగారు.
తొలి జాబితాలో సిట్టింగ్ శాసనసభ్యుడు కె. ప్రతాప రెడ్డికి జనగాం సీటును ఖరారు చేశారు. వికారాబాద్ సీటును మాజీ మంత్రి, సిట్టింగ్ శాసనసభ్యుడు చంద్రశేఖర్ కే ఇచ్చారు. షాద్ నగర్ నుంచి అంజయ్య యాదవ్, మహబూబ్ నగర్ నుంచి సయ్యద్ ఇబ్రహీం, మక్తల్ నుంచి శ్రీధర్ గౌడ్, సనత్ నగర్ నుంచి పద్మారావు, కూకట్ పల్లి నుంచి సుదర్శన్ రావు, పెద్దపల్లి నుంచి సి.సత్యనారాయమ రెడ్డి, నిర్మల్ నుంచి శ్రీహరిరావు, ధర్మపురి నుంచి కె.ఈశ్వర్, అచ్చంపేట నుంచి బాలరాజు, సిర్పూర్ నుంచి సమ్మయ్య, వరంగల్ (తూర్పు) నుంచి విద్యాసాగర్, ఆసిఫాబాద్ నుంచి గోపి తెరాస అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా స్థానాలకు 11 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. జాబితా వివరాలు -
పరకాల - మధుసూదనాచారి
రామగుండం - చందర్
హుజూరాబాద్ - ఈటెల రాజేందర్
ఆలేరు - యాదగిరి రెడ్డి
దుబ్బాక - రామలింగారెడ్డి
హుస్నాబాద్ - కెప్టెన్ లక్ష్మీకాంతరావు
మానకొండూరు - ఆనంద్
చెన్నూరు - ఓదేలు
వనపర్తి - వాసంతి ముదిరాజ్
మంధని - కనకయ్య
మహబూబాబాద్ - చందూలాల్
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications