థాకరేకు వరుణ్ గాంధీ కృతజ్ఞతలు

బాల్ థాకరే మద్దతు తనకెంతో ఆనందాన్నిచ్చిందని ఆయన అన్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా వరుణ్ గాంధీ వ్యాఖ్యానించడంలో తప్పేమీ లేదని థాకరే అన్నారు. శివసేన అధికారిక పత్రిక సామ్నాలో రాసిన సంపాదకీయంలో ఆయన వరుణ్ ను సమర్థించారు. వరుణ్ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని, వరుణ్ సత్యమే మాట్లాడారని ఆయన అన్నారు. తాను ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడలేదని, సిడిలో తన గొంతును అనుకరిస్తూ తన మాటలను మార్చారని వరుణ్ ఎన్నికల కమిషన్ కు తెలియజేశారు.












Click it and Unblock the Notifications