మొరాదాబాద్ నుంచి అజర్ పోటీ

Mohammed Azharuddin
న్యూఢిల్లీ: హైదరాబాదుకు చెందిన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహ్మద్ అజరుద్దీన్ ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ నుంచి లోకసభకు పోటీ చేసే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేయించడానికి అజర్ ను కాంగ్రెసు పార్టీలో చేర్చుకుంటున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయనకు టికెట్ లభించలేదు. దీంతో ఇతర రాష్ట్రాల్లో ఏదైనా ఒక స్థానం నుంచి ఆయనను బరిలోకి దింపే ఆలోచనలో కాంగ్రెసు నాయకత్వం ఉంది.

మొరాదాబాద్ నుంచి అజర్ ను పోటీకి దించేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు రీటా బహుగుణ మీడియా ప్రతినిధులతో చెప్పారు. మొరాదాబాద్ నుంచి బలమైన అభ్యర్థిని పోటీకి దించాలని భావిస్తున్నామని, అజర్ బలమైన అభ్యర్థి అవుతారని ఆమె అన్నారు. తాను పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తానని అజర్ చెప్పారు. తనకు సోనియా నాయకత్వంపై నమ్మకం ఉందని, పార్టీ నిర్ణయం మేరకు ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని ఆయన అన్నారు. రాజస్తాన్ రాష్ట్రంలోని ఏదైనా నియోజకవర్గం నుంచి అజర్ పోటీ చేసే అవకాశాలున్నట్లు ఇంతకు ముందు వార్తలు వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+