హైదరాబాద్: వివాదంలో ఉన్న కొన్ని శాసనసభా స్థానాలకు ఏకపక్షంగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు అభ్యర్థులను ప్రకటించడంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని సీట్లపై చర్చ పూర్తి కాలేదని, అయినా తెరాస తన అభ్యర్థులను ప్రకటించిందని, ఇది సరైంది కాదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.
హుస్నాబాద్, అచ్చంపేట వంటి ఐదారు సీట్ల విషయంలో వివాదం ఉందని, వాటికి తెరాస అభ్యర్థులను ప్రకటించడం సరైంది కాదని ఆయన అన్నారు. ఈ సీట్లపై గురువారం చర్చలు జరుగుతాయని ఆయన చెప్పారు.