ఎన్టీఆర్ ప్రచారం కష్టమే: కోడెల
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇక ప్రచారంలో పాల్గొనకపోవచ్చని టీడీపీ నేత డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. కిమ్స్‌లో ఆయనను పరామర్శించేందుకు వచ్చిన ఎన్టీఆర్ కోడెల మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ పూర్తిగా కోలుకోకముందే ప్రచారానికి వస్తే కష్టమని అన్నారు. డాక్టర్ కోడెల గుంటూరు జిల్లాలో పేరున్న సర్జన్. ఆయన ఆరోగ్యం కంటే ప్రచారం ముఖ్యం కాదన్నారు. ఆయన గాయాలు చిన్నవేనని, అయితే ఆయన పూర్తిగా కోలుకునేలోగా ప్రచారంకూడా ముగింపుదశకు వస్తుందని అందుకే ఆయన రాకపోవచ్చని అన్నారు.












Click it and Unblock the Notifications