తండ్రి ఆశీస్సులున్నాయ్: పురందరేశ్వరి
హైదరాబాద్: తన తండ్రి ఎన్టీఆర్ ఆశీస్సులతో ఐదేళ్లూ రాజకీయంగా విజయాలు సాధించగలిగానని కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు బయలుదేరుతూ శుక్రవారమిక్కడ ఎన్టీఆర్ ఘాట్ వద్ద భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి ఎన్టీఆర్‌కు ఆమె నివాళి అర్పించారు. ఈనెల 30న ఉదయం 11.30 గంటలకు విశాఖపట్నంలో నామినేషన్ దాఖలు చేస్తానని పురంధేశ్వరి తెలిపారు. విశాఖ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పురంధేశ్వరి హైటెక్ ప్రచారం చేపట్టనున్నారు. ఆమె ప్రచారం కోసం సర్వ హంగులతో ఒక వ్యాన్ సిద్ధమైంది.












Click it and Unblock the Notifications